తెలంగాణ విజయం | telangana wins basket ball championship | Sakshi
Sakshi News home page

తెలంగాణ విజయం

Jul 7 2017 10:53 AM | Updated on Apr 7 2019 3:47 PM

జాతీయ యూత్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టుకు ఊరట విజయం దక్కింది.

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ యూత్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల జట్టుకు ఊరట విజయం దక్కింది. గచ్చిబౌలిలో జరుగుతోన్న ఈ టోర్నీలో లెవల్‌–2 ఫైనల్‌ మ్యాచ్‌లో తెలంగాణ విజేతగా నిలిచింది. ఫైనల్లో తెలంగాణ జట్టు 79–69తో అస్సాం జట్టుపై విజయం సాధించింది.

 

తెలంగాణ తరఫున వినయ్‌ కొఠారి, రితిక్‌ చెరో 16 పాయింట్లతో చెలరేగగా అమన్, విఘ్నేశ్వర్‌ ఉపాధ్యాయ్‌ చెరో 13 పాయింట్లతో ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి జట్టులో సలేవ్‌ (21), సంజయ్‌ బాల్మీకి (19), శివమ్‌ సునర్‌ (12) రాణించారు. మెయిన్‌ డ్రా నుంచి ఎలిమినేట్‌ అయిన జట్లు లెవల్‌–2 విభాగంలో ఆడతాయి.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement