చెలరేగిన సూర్య విక్రమాదిత్య | surya took 6 wickets | Sakshi
Sakshi News home page

చెలరేగిన సూర్య విక్రమాదిత్య

Aug 22 2013 11:51 PM | Updated on Sep 1 2017 10:01 PM

చెలరేగిన సూర్య విక్రమాదిత్య

చెలరేగిన సూర్య విక్రమాదిత్య

అవర్స్ సీసీ జట్టు బౌలర్ సూర్య విక్రమాదిత్య 6 వికెట్లు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఎ- డివిజన్ రెండు రోజుల లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో అవ ర్స్ సీసీ జట్టు బౌలర్ సూర్య...

జింఖానా, న్యూస్‌లైన్: అవర్స్ సీసీ జట్టు బౌలర్ సూర్య విక్రమాదిత్య 6 వికెట్లు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఎ- డివిజన్ రెండు రోజుల లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో అవ ర్స్ సీసీ జట్టు బౌలర్ సూర్య... పాషా బీడి జట్టు బ్యాటింగ్‌ను కట్టడి చేయడంతో పాషా జట్టు 104 పరుగుల వద్ద ఆలౌటైంది.
 
 పాషా బీడి జట్టు ఆటగాళ్లు ఫరాన్ (31), ముజ్తబా (30) మినహా తక్కినవారు రాణించలేక పోయారు. మరో మ్యాచ్‌లో జిందా సీసీ జట్టు బ్యాట్స్‌మెన్ ఫరాజ్ నవీద్ 159 , హుస్సేన్ 62, అజహర్ 57 పరుగులతో కదం తొక్కడంతో జట్టు 395 పరుగులు సాధించింది. హెచ్‌బీసీసీ జట్టు బౌలర్ ఒమర్ ఖాన్ 8 వికెట్లు తీసి చెలరేగినప్పటికీ జిందా జట్టు భారీ స్కోరును అడ్డుకోలేకపోయాడు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 బాలాజీ కోల్ట్స్: 294 (నవదీప్ సింగ్ 130, అమిత్ యాదవ్ 38, భాస్కర్ 34; తక్విల్లా 6/92), పీ అండ్ టీతో మ్యాచ్
 ఉస్మానియా: 404 (సిద్ధాంత్ 119, రామ్ ప్రసాద్ 76, సృజన్ 32, దినేష్ 31; శ్రీరామ్ 3/85), రాజు సీసీతో మ్యాచ్
 సుల్తాన్ షాహీ: 386 (ప్రసాద్ 56, మహేష్ కుమార్ 60, సాయికుమార్ 65, యోగి 95; చంద్రకాంత్ 5/113), హైదరాబాద్ టైటాన్స్: 55/5.
 

Advertisement
 
Advertisement
Advertisement