సెమీస్‌లో సంజన | Sanjana in Semis of ITF Tennis Tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సంజన

Sep 6 2018 10:09 AM | Updated on Sep 6 2018 10:09 AM

Sanjana in Semis of ITF Tennis Tourney - Sakshi

  సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) గ్రేడ్‌–5 జూనియర్స్‌ టెన్నిస్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి సంజన సిరిమళ్ల నిలకడగా రాణిస్తోంది. శ్రీలంకలో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్‌ విభాగంలో సెమీస్‌కు చేరుకున్న సంజన... డబుల్స్‌ విభాగంలో క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సంజన (భారత్‌) 6–2, 7–5తో టాప్‌సీడ్‌ లింగ్‌ చుయ్‌ కీ (హాంకాంగ్‌)కి షాకిచ్చింది.

అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 6–4, 6–4తో మ యుజా (చైనా)పై, తొలిరౌండ్‌లో 6–4, 5–7, 6–4తో సెనివిరత్నే (శ్రీలంక)పై గెలుపొందింది. మరోవైపు బాలికల డబుల్స్‌ తొలిరౌండ్‌లో బిపాషా– సంజన (భారత్‌) ద్వయం 6–4, 7–5తో లిన్‌ జిన్‌ టాన్‌– హనా సీన్‌ ఇయాన్‌ యిప్‌ (మలేసియా) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement