విజేతలు సంజన, రెనీశర్మ | Sanjana, Reni Sharma won AITA Titles | Sakshi
Sakshi News home page

విజేతలు సంజన, రెనీశర్మ

Jun 17 2018 10:11 AM | Updated on Jun 17 2018 10:11 AM

Sanjana, Reni Sharma won AITA Titles - Sakshi

హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్‌ సిరీస్‌లో తెలంగాణ క్రీడాకారులు సంజన సిరిమల్ల, రెనీ శర్మ విజేతలుగా నిలిచారు. కొంపల్లిలోని సురేశ్‌ కృష్ణ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో అండర్‌–16 విభాగంలో రెనీశర్మ, అండర్‌–18 విభాగంలో సంజన టైటిళ్లను సాధించారు. శనివారం జరిగిన అండర్‌–16 బాలికల సింగిల్స్‌ ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన రాధిక మహాజన్‌పై రెనీశర్మ విజయం సాధించింది. అండర్‌–18 కేటగిరీలో తెలంగాణకే చెందిన బిపాసా మోహన్‌పై సంజన నెగ్గింది. బాలుర విభాగంలో అఖిల్‌ కుమార్‌ (తెలంగాణ) విజేతగా నిలవగా, అశ్విన్‌ భట్‌ (కర్నాటక) రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.

పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టోర్నమెంట్‌ డైరెక్టర్‌ కృష్ణం రాజు, స్పాన్సర్‌ ప్రవీణ్‌ ముఖ్యఅతిథులుగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ కోచ్‌ సురేశ్‌కృష్ణ, మేనేజర్‌ రతన్‌ రావు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement