షమీ సీక్రెట్‌ అదే: రోహిత్‌

Rohit Sharma Reveals The Secret Behind Shamis Success - Sakshi

విశాఖ: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ రెండు వరుస శతకాలతో చెలరేగిపోతే, పిచ్‌ పరిస్థితిని చక్కగా అర్ధం చేసుకున్న పేసర్‌ షమీ తన బౌలింగ్‌ పవర్‌ చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్‌ కూడా సాధించిన షమీ.. చివరి రోజు అద్భుతాలు చేస్తాడని ముందుగా ఊహించినట్లే ఐదు వికెట్లను ఖాతాలో వేసుకుని సఫారీల పతనాన్ని శాసించాడు. నిన్నటి ఆటలో లంచ్‌ బ్రేక్‌ తర్వాత పీయడ్త్‌కు వేసిన బంతికి వికెట్‌ విరిగిపోవడం షమీ బౌలింగ్‌లో వేగానికి నిదర్శనం.

ఆఫ్‌సైడ్‌ ఎడ్డ్‌ తీసుకున్న బంతి నేరుగా వికెట్లపైకి దూసుపోయింది. అందులో ఒక స్టంప్‌ ముక్కలైంది. దీన్ని భారత క్రికెట్‌ టీమ్‌ తన అధికారిక అకౌంట్‌లో కూడా పోస్ట్‌ చేసింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో షమీ అదరగొట్టడం వెనుక ఉన్న సీక్రెట్‌ ఏమిటో రోహిత్‌ వెల్లడించాడు. షమీ బిర్యానీ తినడమే తన అద్భుత గణాంకాలకు కారణమని చెప్పుకొచ్చాడు.  ‘బిర్యానీ తిన్న తర్వాత షమి ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. దాంతో అతడిలో అత్యుత్తమ ప్రతిభ వెలుగులోకి వస్తుంది’ అని నవ్వుతూ అన్నాడు.(ఇక్కడ చదవండి: షమీ శత్రు వినాశిని...)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top