రామ్‌కుమార్‌ శుభారంభం | Ramkumar started well | Sakshi
Sakshi News home page

రామ్‌కుమార్‌ శుభారంభం

May 3 2017 11:10 PM | Updated on Sep 5 2017 10:19 AM

రామ్‌కుమార్‌ శుభారంభం

రామ్‌కుమార్‌ శుభారంభం

దక్షిణ కొరియాలో జరుగుతున్న సవాన్న చాలెంజర్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ రామ్‌కుమార్‌ రామ్‌నాథన్‌ శుభారంభం చేశాడు.

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాలో జరుగుతున్న సవాన్న చాలెంజర్‌ టోర్నీలో భారత ప్లేయర్‌ రామ్‌కుమార్‌ రామ్‌నాథన్‌ శుభారంభం చేశాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన రామ్‌కుమార్‌ పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో 6–4, 7–5తో స్థానిక ప్లేయర్‌ ర్యాన్‌ షేన్‌పై అలవోక విజయం సాధించాడు. గతవారం తాష్కెంట్‌ చాలెంజర్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన రామ్‌కుమార్‌ ఈ టోర్నీలోనూ ఆ జోరును చూపించాడు.

మరోవైపు ఇదే టోర్నీలో బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ తొలిరౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. రెండోసీడ్‌ కాంస్టంటిన్‌ క్రావ్‌చుక్‌ (రష్యా)తో జరిగిన మ్యచ్‌లో 2–6, 6–1, 3–6తో యూకీ పోరాడి ఓడిపోయాడు.   అయితే డబుల్స్‌లో మాత్రం యూకీ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో యూకీ–క్లెన్‌ బ్రైడెన్‌ (ఇంగ్లండ్‌) ద్వయం 4–6, 6–4, 10–3తో చుంగ్‌–సూన్‌ జంటపై ‘సూపర్‌ టైబ్రేక్‌’లో విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement