వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కష్టాల్లో కూరుకుపోయింది.
మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కష్టాల్లో కూరుకుపోయింది. 151 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. రోంచి డకౌటయ్యాడు.
150 పరుగుల స్కోరు వద్ద ఆండర్సన్(0), రాస్ టేలర్(40) వరుసగా అవుటడంతో కివీస్ షాక్ కు గురైంది. ఇలియట్(72) పోరాటం చేస్తున్నాడు. టేలర్ తో కలిసి నాలుగో వికెట్ కు 138 బంతుల్లో 111 పరుగులు జోడించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, ఫాల్కనర్ 2 రెండేసి వికెట్లు పడగొట్టారు. జాన్సన్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ తీశారు.