బాస్కెట్‌బాల్ విజేత లయోలా | layola degree college wins basket ball title | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్ విజేత లయోలా

Oct 2 2016 12:20 PM | Updated on Sep 4 2017 3:55 PM

ఉస్మానియా యూనివర్శిటీ ఇంటర్ కాలేజ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో లయోలా డిగీ కాలేజ్ (అల్వాల్) విజేతగా నిలిచింది.

సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ ఇంటర్ కాలేజ్ బాస్కెట్‌బాల్ టోర్నీలో లయోలా డిగీ కాలేజ్ (అల్వాల్) విజేతగా నిలిచింది. సిటీ కాలేజ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన ఈ టోర్నీ ఫైనల్లో లయోలా 75-40 స్కోరుతో భవాన్‌‌స డిగ్రీ కాలేజ్ (సైనిక్‌పురి) పై విజయం సాధించింది. సిటీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సి. మంజులత విజేతలకు బహుమతులు అందజేశారు. నిర్వాహక కార్యదర్శి నర్సింగరావు, సునీల్ కుమార్, జేసీ బాబు, రవిప్రసాద్, వెంకటేశ్వరరావు,  రాజేశ్ కుమార్ తదితరులు బహుమతి ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement