కావ్య మీనన్‌కు రెండు పతకాలు | kavya meenan got two medals | Sakshi
Sakshi News home page

కావ్య మీనన్‌కు రెండు పతకాలు

Sep 3 2017 12:38 PM | Updated on Sep 17 2017 6:20 PM

కావ్య మీనన్‌కు రెండు పతకాలు

కావ్య మీనన్‌కు రెండు పతకాలు

ప్రపంచ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి కావ్య మీనన్‌ ఆకట్టుకుంది.

ప్రపంచ కరాటే చాంపియన్‌షిప్‌


సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ కరాటే చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారిణి కావ్య మీనన్‌ ఆకట్టుకుంది. ఐర్లాండ్‌లోని కెర్రీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో రజత, కాంస్య పతకాలను సాధించింది. అండర్‌ 13–17 వయో విభాగంలో 50 కేజీల కరాటే కుమిటీ ఈవెంట్‌లో తలపడిన కావ్య వ్యక్తిగత విభాగంలో రన్నరప్‌గా నిలిచి రజతాన్ని గెలుచుకుంది. గ్రూప్‌ విభాగంలో కాంస్యాన్ని దక్కించుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో 30 దేశాలకు చెందిన దాదాపు 2000 మంది క్రీడాకారులు తలపడగా, భారత్‌ నుంచి ఏడుగురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ఐదుగురు రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం.

 

ఆగస్టు 26 నుంచి 31 వరకు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రానికి 4 రజత, 8 కాంస్య పతకాలు లభించాయి. ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించిన కావ్య మీనన్‌ను శాట్స్‌ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించేందుకు వీలుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించాలన్న కావ్య వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement