మొత్తానికి ఆధిక్యమైతే దక్కింది! కానీ అది కొంతే! వెస్టిండీస్ మరీ ఏమీ వెనుకబడి లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థికి భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించి తొలి టెస్టులో టీమిండియాను పైమెట్టులో నిలిపే బాధ్యత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానేలపై పడింది. వీరికితోడు విహారి, పంత్ కొన్ని పరుగులు జోడిస్తే మిగిలిన పనిని బౌలర్లు చూసుకునే వీలుంటుంది.
నార్త్ సౌండ్ (అంటిగ్వా): సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (5/43) ప్రతాపం చూపాడు. కీలక సమయంలో వికెట్లు తీసి తొలి టెస్టులో వెస్టిండీస్‌ను దెబ్బకొట్టాడు. దీంతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. ఆల్ రౌండర్ రోస్టన్ చేజ్ (74 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్) ఆ జట్టు టాప్ స్కోరర్. కెప్టెన్ హోల్డర్ (65 బంతుల్లో 39; 5 ఫోర్లు), హెట్‌మైర్ (47 బంతుల్లో 35; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. షమీ (2/48), జడేజా (2/64)లకు రెండేసి వికెట్లు దక్కాయి. 75 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ టీ విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (16), కేఎల్ రాహుల్ (85 బంతుల్లో 38; 4 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (25) ఔటయ్యారు. కోహ్లి (14 బ్యాటింగ్), రహానే (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి కోహ్లి సేన 173 పరుగుల ఆధిక్యంలో ఉంది.
హోల్డర్, కమిన్స్ విసిగించారు...
భారత లోయరార్డర్లో జడేజా–ఇషాంత్ తరహాలోనే విండీస్ లోయరార్డర్లో హోల్డర్, మిగుయెల్ కమిన్స్ (45 బంతుల్లో 0) బౌలర్లను విసిగించారు. ఓవర్‌నైట్ స్కోరు 189/8 శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన కరీబియన్లు ఆలౌట్ కావడానికి ఎంతోసేపు పట్టదనిపించింది. కానీ, హోల్డర్, కమిన్స్ పట్టుదల చూపారు. 17 ఓవర్లకు పైగా క్రీజులో నిలిచి జట్టు స్కోరును 200 దాటించారు. 9వ వికెట్‌కు 41 పరుగులు జత చేశారు. హోల్డర్‌ను ఔట్ చేసి షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కమిన్స్‌ను జడేజా బౌల్డ్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. శుక్రవారం టీ సెషన్ అనంతరం భారత బౌలర్ల ధాటికి ప్రత్యర్థి తడబడింది. ప్రతి బ్యాట్స్‌మెన్ అన్నోఇన్నో పరుగులు చేయడంతో ఓ దశలో 130/4తో కాస్త మెరుగ్గానే కనిపించింది. అయితే, ఇషాంత్ విజృంభించి... కీలకమైన చేజ్, హోప్ (24), హెట్మైర్ను ఔట్ చేశాడు. ఇదే ఊపులో రోచ్ (0) పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
కోహ్లి, రహానే చేతుల్లో...
Published Sun, Aug 25 2019 4:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్‌కప్‌కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement