60 సెకన్లలో హాంఫట్... | Finish in 60 seconds | Sakshi
Sakshi News home page

60 సెకన్లలో హాంఫట్...

Apr 26 2015 2:13 AM | Updated on Sep 3 2017 12:52 AM

60 సెకన్లలో హాంఫట్...

60 సెకన్లలో హాంఫట్...

విఖ్యాత బాక్సింగ్ స్టార్స్ ఫ్లోయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ ప్యాకియో (ఫిలిప్పీన్స్)ల మధ్య మే 2న జరిగే ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

న్యూయార్క్ : విఖ్యాత బాక్సింగ్ స్టార్స్ ఫ్లోయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ ప్యాకియో (ఫిలిప్పీన్స్)ల మధ్య మే 2న జరిగే ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. శుక్రవారం టికెట్ల అమ్మకాలు మొదలైన 60 సెకన్లలోపే అన్ని టికెట్లు అయిపోయాయి. వీరిద్దరి బౌట్‌కు వేదికగా నిలువనున్న లాస్‌వేగాస్‌లోని ఎంజీ ఎం గ్రాండ్ గార్డెన్ ఎరీనా సామర్థ్యం 16 వేలు. కాగా అభిమానులకు 14 వేల టికెట్లు విక్రయించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన 38 ఏళ్ల మేవెదర్ తన కెరీర్‌లో 47 బౌట్‌లలోనూ విజేతగా నిలిచాడు. ప్యాకియో 64 బౌట్‌లలో 57 విజయాలు నమోదు చేసుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement