దుమ్ము రేపిన గోవా | FC Goa thrash NorthEast United FC 3-0 | Sakshi
Sakshi News home page

దుమ్ము రేపిన గోవా

Dec 2 2014 12:25 AM | Updated on Sep 2 2017 5:28 PM

దుమ్ము రేపిన గోవా

దుమ్ము రేపిన గోవా

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టు అద్భుత రీతిలో చెలరేగుతోంది.

నార్త్‌ఈస్ట్ యునెటైడ్‌పై 3-0తో గెలుపు
ఫటోర్డా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఎఫ్‌సీ గోవా జట్టు అద్భుత రీతిలో చెలరేగుతోంది. సొంత మైదానంలో వరుసగా మూడో విజయాన్ని సాధించి తమ సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. సోమవారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 3-0తో నెగ్గింది. ఈ విజయంతో 18 పాయింట్లతో కోల్‌కతాను వెనక్కినెట్టి రెండో స్థానానికి చేరింది.

ప్రస్తుతం నార్త్‌ఈస్ట్ 13 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. 33వ నిమిషంలో రోమియో ఫెర్నాండెజ్ గోల్‌తో బోణీ చేసిన గోవా 45+1 నిమిషంలో మిరోస్లావ్ స్లెపికా రెండో గోల్‌తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. ద్వితీయార్ధంలో నార్త్‌ఈస్ట్ గోల్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే 74వ నిమిషంలో గోవాకు ఆండ్రీ సాంటోస్ గోల్ అందించగా తిరుగులేని విజయం ఖాయమైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement