ఢిల్లీ వేవ్‌రైడర్స్‌కు మరో పరాజయం | Delhi Waveriders winless run in HIL 2017 continues, lose 2-3 | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వేవ్‌రైడర్స్‌కు మరో పరాజయం

Feb 8 2017 12:02 AM | Updated on Sep 5 2017 3:09 AM

హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) ఐదో సీజన్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ పరాజయాలు కొనసాగుతున్నాయి. మంగళవారం డిఫెండింగ్‌ చాంపియన్‌ పంజాబ్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 2–3తో ఓడింది.

న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) ఐదో సీజన్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ పరాజయాలు కొనసాగుతున్నాయి. మంగళవారం డిఫెండింగ్‌ చాంపియన్‌ పంజాబ్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 2–3తో ఓడింది. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఈ జట్టు మూడు ఓటములు, ఓ డ్రాతో పాయింట్ల పట్టికలో అట్టడుగున కొనసాగుతోంది. పంజాబ్‌ నుంచి 15వ నిమిషంలో వాన్‌డర్‌ హోర్ట్స్‌ ఫీల్డ్‌ గోల్‌ చేయగా 53వ నిమిషంలో వాన్‌డర్‌ వీర్డన్‌ మరో గోల్‌ సాధించాడు. ఢిల్లీ నుంచి వైట్‌ ట్రిస్టాన్‌ (39) ఫీల్డ్‌ గోల్‌ చేశాడు. బుధవారం జరిగే మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్‌తో ఢిల్లీ ఆడుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement