'నా అంచనా తప్పని బూమ్రా నిరూపించాడు'

Bumrah has changed our mindset, says Kapil Dev - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత భారత జట్టులో ప్రధాన బౌలర్ గా మారిపోయిన జస్ఫిత్ బూమ్రాపై తనకు తొలినాళ్లలో ఉన్న అభిప్రాయం తప్పని నిరూపితమైందని మాజీ దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ స్పష్టం చేశాడు. బూమ్రా వచ్చిన కొత్తలో అతని యాక్షన్ చూసి ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగడం కష్టమనుకున్నానని, అది తప్పని స్వల్ప వ్యవధిలోనే నిరూపించాడని కపిల్ పేర్కొన్నాడు.

'బూమ్రా ఒక అసాధారణ బౌలర్ గా మారిపోయాడు. నేను తొలిసారి చూసి అంచనా వేసిన బూమ్రాకు ఇప్పటి బూమ్రాకు చాలా తేడా ఉంది. ఒక విలక్షణమైన యాక్షన్ కల్గిన బూమ్రా అంతర్జాతీయ క్రికెట్ లో రాణిస్తాడా అనే అనుమానం ఉండేది. దాన్ని అతను తప్పని నిరూపించాడు'అని కపిల్ పేర్కొన్నాడు. మరొకవైపు భారత జట్టులో ఆటగాళ్లంతా పూర్తిస్థాయి ఫిట్ నెస్ కల్గి ఉండాలన్న కోహ్లి నిర్ణయాన్ని తప్పకుండా గౌరవించాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో భారత జట్టు అత్యుత్తమ ఫిట్ నెస్ స్థాయిని కల్గి ఉందంటే దానికి కోహ్లినే కారణమంటూ కపిల్ దేవ్ కొనియాడాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top