బియాంచికి శస్త్ర చికిత్స | Biyanciki surgery | Sakshi
Sakshi News home page

బియాంచికి శస్త్ర చికిత్స

Oct 6 2014 1:41 AM | Updated on Sep 2 2017 2:23 PM

బియాంచికి శస్త్ర చికిత్స

బియాంచికి శస్త్ర చికిత్స

వర్షంలోనే కొనసాగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో అపశ్రుతి చోటు చేసుకుంది. 42వ ల్యాప్‌లో సాబెర్ జట్టు డ్రైవర్ అడ్రియన్ సుటిల్ కారుపై నియంత్రణ...

వర్షంలోనే కొనసాగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో అపశ్రుతి చోటు చేసుకుంది. 42వ ల్యాప్‌లో సాబెర్ జట్టు డ్రైవర్ అడ్రియన్ సుటిల్ కారుపై నియంత్రణ కోల్పోయి ట్రాక్‌కు పక్కన ఉన్న గోడను ఢీకొట్టి రేసు నుంచి తప్పుకున్నాడు. సుటిల్ కారును ట్రాక్‌పై నుంచి తీయడానికి మరో వాహనం వచ్చింది. అయితే ఈ వాహనాన్ని వెనుక నుంచి మారుసియా జట్టు డ్రైవర్ బియాంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే బియాంచి సృహ కోల్పోయాడు. వెంటనే నిర్వాహకులు అతణ్ని అంబులెన్స్‌లో ఆస్ప్రతికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో వైద్యులు బియాంచికి శస్త్ర చికిత్స నిర్వహించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement