బంతి వికెట్లను తాకినా.. బెయిల్స్ పడలేదు! | ball hit the stumps, but there is no bails up | Sakshi
Sakshi News home page

బంతి వికెట్లను తాకినా.. బెయిల్స్ పడలేదు!

Mar 29 2015 2:19 PM | Updated on Sep 2 2017 11:33 PM

బంతి వికెట్లను తాకినా.. బెయిల్స్ పడలేదు!

బంతి వికెట్లను తాకినా.. బెయిల్స్ పడలేదు!

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తృటిలో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

మెల్ బోర్న్:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తృటిలో అవుటయ్యే ప్రమాదం నుంచి  తప్పించుకున్నాడు. 14 ఓవర్ ముగిసిన అనంతరం స్మిత్ బ్యాటింగ్ ఎండ్ లో ఉన్నాడు. ఆ తరుణంలో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ పదిహేనో ఓవర్ లో తొలి బంతిని సంధించాడు. ఆ బంతి స్మిత్ ప్యాడ్ లపై పడి వికెట్లను తాకింది. అయినా బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికి బయటపడ్డాడు. ఆ సమయానికి స్మిత్ 16 పరుగులతో క్రీజ్ లో ఉండగా ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది.
 

 

ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో ఇదే తరహా ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మిస్బా-వుల్-హక్ బ్యాటింగ్ చేసే సమయంలో బంతి వికెట్లను తాకి లైట్లు వెలిగినా.. బెయిల్స్ మాత్రం పడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement