రన్నరప్ సాకేత్ | ATP Challenger singles title | Sakshi
Sakshi News home page

రన్నరప్ సాకేత్

Oct 4 2015 11:53 PM | Updated on Sep 3 2017 10:26 AM

కెరీర్‌లో రెండోసారి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి నిరాశ ఎదురైంది.

సాక్షి, హైదరాబాద్: కెరీర్‌లో రెండోసారి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి నిరాశ ఎదురైంది. టర్కీలోని అగ్రి పట్టణంలో ఆదివారం ముగిసిన ఏటీపీ చాలెం జర్ టోర్నీలో సాకేత్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ఎనిమిదో సీడ్ సాకేత్ 4-6, 4-6తో ఆరో సీడ్ ఫారూఖ్ దస్తోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ ఏడు ఏస్‌లు సంధించడంతోపాటు నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. రన్నరప్‌గా నిలిచిన సాకేత్‌కు 3,600 యూరోల (రూ. 2 లక్షల 63 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 55 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement