తెలంగాణ హాకీ జట్టు కెప్టెన్‌ అశోక్‌ | Ashok Kumar as Hockey Captain of Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ హాకీ జట్టు కెప్టెన్‌ అశోక్‌

Jan 3 2019 11:55 AM | Updated on Jan 3 2019 11:55 AM

Ashok Kumar as Hockey Captain of Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేపటి నుంచి చెన్నైలో జరిగే జాతీయ హాకీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ సీనియర్‌ పురుషుల జట్టుకు అశోక్‌ కుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వైస్‌ కెప్టెన్‌గా సంపత్‌ కుమార్‌ను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ హాకీ సంఘం అధ్యక్షుడు సరల్‌ తల్వర్‌ ప్లేయర్లకు కిట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్‌’ ఎండీ దినకర్‌ బాబు, విజేందర్‌ రెడ్డి, ముఖేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

జట్టు: అశోక్‌ కుమార్‌ (కెప్టెన్‌), సంపత్‌ కుమార్‌ (వైస్‌ కెప్టెన్‌), సాయి వినీత్, చంద్రకాంత్‌ గౌడ్, ప్రశాంత్, అరవింద్, భవాని రంజిత్‌ చంద్, సాయి ప్రసాద్, మొహమ్మద్‌ అజీజ్, అవినీత్, శ్రీనివాస్, రామకృష్ణ, ముంతాజ్, సాగర్, దుర్గా ప్రసాద్, రాజశేఖర్, రాజేశ్, ఫిరోజ్‌ బిన్‌ ఫర్హాజ్‌. అల్ఫాన్స్‌ లాజరస్‌ (కోచ్‌), ఇమామ్‌ కరీం (మేనేజర్‌). 

Advertisement
 
Advertisement
Advertisement