ముందు ఒళ్లు కప్పుకో! | Amla refused 'underdressed' reporter interview | Sakshi
Sakshi News home page

ముందు ఒళ్లు కప్పుకో!

Feb 6 2016 1:25 AM | Updated on Sep 3 2017 5:01 PM

ముందు ఒళ్లు కప్పుకో!

ముందు ఒళ్లు కప్పుకో!

మత సాంప్రదాయాలను పాటించే విషయంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా బాగా పట్టుదల కనబరుస్తాడు.

యాంకర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వని ఆమ్లా
న్యూఢిల్లీ: మత సాంప్రదాయాలను పాటించే విషయంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా బాగా పట్టుదల కనబరుస్తాడు. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా జరిగిన ఒక ఘటన అతనిలోని ఈ కోణాన్ని మరోసారి బయటపెట్టింది. ఆలస్యంగా ఈ ఉదంతం వెలుగు చూసింది. ముంబైలో జరిగిన ఆఖరి మ్యాచ్ తర్వాత ప్రసారకర్తలకు చెందిన ఒక మహిళా వ్యాఖ్యాత ఆమ్లాను ఇంటర్వ్యూకు పిలిచింది.

అయితే ఆమె వేసుకున్న కురచ దుస్తులు, లో నెక్ టాప్ ఆమ్లాను ఇబ్బంది పెట్టాయి. ఈ స్థితిలో తను ఆమెకు ఇంటర్వ్యూ ఇవ్వలేనని, ముందు పూర్తిగా బట్టలు వేసుకోవాలని అతను చెప్పేశాడు. దాంతో ఆశ్చర్యపోయిన సదరు యాంకర్ తమ టీమ్‌తో మాట్లాడింది. వారు కూడా ఆమ్లా అభిప్రాయాన్ని గౌరవించి తమ యాంకర్ వేసుకున్న డ్రెస్‌ను వెంటనే మార్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement