పొత్తులపై మాట్లాడే హక్కు కేసీఆర్‌కు ఎక్కడిది: చాడ | Sakshi
Sakshi News home page

పొత్తులపై మాట్లాడే హక్కు కేసీఆర్‌కు ఎక్కడిది: చాడ

Published Sat, Oct 6 2018 1:11 AM

Chada venkat reddy comments over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయపార్టీల మధ్య ఎన్నికల పొత్తు ల గురించి మాట్లాడేహక్కు పచ్చి రాజకీయ అవకాశవాది అయిన సీఎం కేసీఆర్‌కు ఎక్కడిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. పార్టీ నేతలు కూనం నేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, గుండా మల్లేశం తదితరులతో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకోసం 100 సభలను పెడతానని చెప్పిన కేసీఆర్‌ ప్రజా వ్యతిరేకతకు చూసి భయపడ్డారన్నారు.

మధ్యలో మౌనంగా ఉన్న ఆయ న ఇప్పుడు మళ్లీ సభలు పెడుతూ టీజేఎస్‌ అధ్యక్షు డు కోదండరాం లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారన్నా రు. రాష్ట్రంలో 11 స్థానాలకు పోటీచేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం నిర్ణయించినట్టు తెలిపారు. కొత్తగూడెం (భద్రాద్రి), వైరా (ఖమ్మం), హుస్నాబాద్‌ (సిద్దిపేట), బెల్లంపల్లి(మంచిర్యాల), ఆలేరు, మునుగోడు (నల్లగొండ), పినపాక(భద్రాద్రి), దేవరకొండ(నల్లగొండ), మంచి ర్యాల, కుత్బుల్లాపూర్‌ లేదా మల్కాజిగిరి, భూపాలపల్లి లేదా మహబూబాబాద్‌ నియోజకవర్గాల్లో పోటీచేయాలని మిత్రపక్షపార్టీలకు ప్రతిపాదనలను పంపినట్టుగా చెప్పారు.

Advertisement
Advertisement