గ్రహం అనుగ్రహం | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం

Published Fri, May 13 2016 2:03 AM

గ్రహం అనుగ్రహం - Sakshi

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం, తిథి శు.సప్తమి ప.2.30 వరకు
తదుపరి అష్టమి, నక్షత్రం ఆశ్లేష రా.3.44 వరకు, వర్జ్యం సా.4.10 నుంచి 5.46 వరకు
దుర్ముహూర్తం ఉ.8.04 నుంచి 8.55 వరకు
తదుపరి ప.12.20 నుంచి 1.12 వరకు
అమృతఘడియలు రా.2.06 నుంచి
3.44 వరకు
సూర్యోదయం :    5.33
సూర్యాస్తమయం:     6.19
రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం:
ప.3.00 నుంచి
4.30 వరకు

మేషం: ప్రయాణాలలో మార్పులు. వృథా ఖర్చులు. ఆరోగ్యపరంగా చికాకులు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపార,ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ఆప్తులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మిథునం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. దైవ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

కర్కాటకం: కార్య జయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. విందువినోదాలు. వ్యాపార,ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కన్య: పరపతి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఉద్యోగలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. చర్చలు సఫలం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలయదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనుస్సు: రుణాలు చేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. సోదరులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన. సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. బంధు విరోధాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. - సింహంభట్ల సుబ్బారావు
 
 
 

Advertisement
Advertisement