మహిళా డైరెక‍్టర్‌కు బెయిల్‌..హైకోర్టు నో | VVIP chopper case: Delhi High Court denies bail to woman director | Sakshi
Sakshi News home page

మహిళా డైరెక‍్టర్‌కు బెయిల్‌..హైకోర్టు నో

Sep 15 2017 7:02 PM | Updated on Sep 19 2017 4:36 PM

మహిళా డైరెక‍్టర్‌కు బెయిల్‌..హైకోర్టు నో

మహిళా డైరెక‍్టర్‌కు బెయిల్‌..హైకోర్టు నో

అగస్టా కేసులో అరెస్ట్‌ అయిన శివానీ సక్సేనా బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.

సాక్షి,న్యూఢిల్లీః అగస్టా కేసులో అరెస్ట్‌ అయిన దుబాయికి చెందిన వ్యాపారవేత్త శివానీ సక్సేనా బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. శివానీ సక్సేనా బెయిల్‌ అప్పీల్‌ను తిరస్కరిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించిన జస్టిస్‌ ఏకే పాథక్‌ ఆమె బెయిల్‌ వినతిని తోసిపుచ్చినట్టు వెల్లడించారు. 
 
దుబాయ్‌కు చెందిన యూహెచ్‌వై సక్సేనా, మ్యాట్రిక్స్‌ హోల్డింగ్స్‌ కంపెనీలకు ఆమె డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. మనీల్యాండరింగ్‌ నియంత్రణ చట్టం( పీఎంఎల్‌ఏ) కింద శివానీ సక్సేనాను జులై 17న చెన్నైలో ఈడీ అరెస్ట్‌ చేసింది. పీఎంఎల్‌ఏ కింద ఆమెపై, దుబాయ్‌ కంపెనీలపై ఈడీ ఇటీవల చార్జిషీట్‌ దాఖలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement