వైరల్‌: కారు కాదు సామి! బైకది..

Viral Video Man Rides Bike With 7 People And 2 Dogs - Sakshi

న్యూఢిల్లీ : మామూలుగా మనం బైక్‌పై త్రిబుల్‌ రైడింగ్‌ వెళ్లటం చూసుంటాం. అరుదుగా ఓ ఐదుగురు, ఆరుగురు వెళ్లటం కూడా చూసుంటాం. ఓ పెద్దమనిషి మాత్రం తన బైకును కారనుకున్నాడో ఏమో! ఏకంగా తన కుటుంబాన్నే దానిపైకి ఎక్కించాడు. కేవలం మనషులతోనే వదల్లేదు పెంపుడు కుక్కలను సైతం బైక్‌మీద ఎక్కించి ఔరా అనిపించాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఓ పెద్దమనిషి తన కుటుంబంలోని ఆరుగురిని(అతడితో కలిపి మొత్తం ఏడుగురు) రెండు కుక్కలను అంతటితో ఆగకుండా పెద్దమొత్తంలో సామాన్లను బైక్‌పై రవాణా చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రిషద్‌ కూపర్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ‘‘ ఆ కుక్కలకు విండో సీటు దొరికింది. ముఖ్యమైన ప్రశ్న.. ఆ బైక్‌ పేరేంటి?. సింగిల్‌ బెడ్‌రూం ప్లాట్‌ను తలపిస్తోంది. కారు కాదు సామి! బైకది.’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top