Sakshi News home page

8 మంది ప్రయాణించే బైక్‌ను ఏమనాలి?

Published Sat, May 20 2017 5:15 PM

8 మంది ప్రయాణించే బైక్‌ను ఏమనాలి?

మోటార్‌బైక్‌ మీద ముగ్గురు లేదా నలుగురు, ఆటోలో ఏడెనిమిది మంది వెళ్లడం చూసి ఉంటాం. వారి ఆర్థిక వెనకబాటుతనానికి అయ్యో పాపం అని జాలి పడి కూడా ఉంటాం. అదే మోటార్‌బైక్‌ మీద 8 మంది ప్రయాణిస్తే వీర జవానుల సాహసకృత్యమో, ఏ సర్కస్‌ ఫీటో అనుకుంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామీణ ప్రాంతంలో ఒకే బైక్‌ మీద్‌ ఎనిమిది మంది కుటుంబసభ్యులు కూర్చొని వెళ్లడం చూస్తే ఔరా! అనకుండా ఉండలేం.

ఇటీవల ఓ పర్యాటకుడికి కనిపించిన ఈ దృశ్యాన్ని ఆయన వీడియోలో బంధించారు. ఇప్పుడు ఆ వీడియో ట్విట్టర్‌లోని సీసీటీవీ ఇడియట్స్‌ అకౌంట్‌ ద్వారా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మోటార్‌బైక్‌కు ఇరువైపుల బ్యాలెన్స్‌గా రెండు చెక్కలను అమర్చడం ద్వారా ఎనిమిది మంది కూర్చోవడానికి ఆ గుర్తుతెలియని బైకర్‌ వీలు కల్పించారు. బ్యాలెన్స్‌ ద్వారా బండి నడుపుతూ చూపరులను ఆకర్షించారు. ఆయన బతుకు బండిని లాగడంలో భాగంగా ఇంతటి సాహసం చేయచ్చు. కానీ బ్యాలెన్స్‌ తప్పితే బైక్‌తో పాటు బతుకుబండి కూడా బ్యాలెన్స్‌ తప్పుతుందిగా!

Advertisement
Advertisement