అక్కడ నో స్మోకింగ్ | Sakshi
Sakshi News home page

అక్కడ నో స్మోకింగ్

Published Mon, Jun 2 2014 1:41 AM

అక్కడ నో స్మోకింగ్

దేశంలోనే తొలి గ్రామంగా  నాగాలాండ్‌లోని గరిఫెమా రికార్డు
 
కోహిమా: పొగాకు వినియోగ రహిత గ్రామంగా నాగాలాండ్‌లోని గరిఫెమా గ్రామం రికార్డులకెక్కింది. అదేవిధంగా దేశంలోనే తొలి పొగాకు వినియోగ రహిత గ్రామంగా కూడా రికార్డు సొంతం చేసుకుంది. ఈ మేరకు ప్రపంచ పొగాకు దినోత్సవం సందర్భంగా శనివారం ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్. బెంచ్‌లొథాంగ్ వెల్లడించారు. గరిఫెమా గ్రామ మండలి సహా గ్రామ విజన్ సెల్, విద్యార్థుల కృషి ఫలితంగా గ్రామం ఈ స్థాయికి చేరుకుందని థాంగ్ వివరించారు.

ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు అమ్మినవారికి రూ.1000, వినియోగించిన వారికి రూ.500 జరిమానా విధించడం ద్వారా పొగాకు వినియోగం అరికట్టడంలో గ్రామ మండలి పూర్తిగా సఫలమైందన్నారు. ఈ గ్రామం ఒక్క నాగాలాండ్ రాష్ట్రానికే కాకుండా మొత్తం దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. కాగా, నాగాలాండ్‌లో 67.9 శాతం మంది పురుషులు, 28.1 శాతం మంది మహిళలు పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. 

Advertisement
Advertisement