ఆ మంత్రులపై వేటుకు నిరాకరించిన సుప్రీం | Sakshi
Sakshi News home page

ఆ మంత్రులపై వేటుకు నిరాకరించిన సుప్రీం

Published Wed, Aug 27 2014 12:47 PM

ఆ మంత్రులపై వేటుకు నిరాకరించిన సుప్రీం - Sakshi

న్యూఢిల్లీ : నేరాభియోగాలున్న మంత్రులపై అనర్హత వేటు వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్ర మంత్రివర్గంలో  నేర చరితులు కొనసాగరాదంటూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. నేర చరితులకు పదవులు ఇవ్వవద్దనేది రాజ్యాంగ స్పూర్తి అని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులపై రాజ్యాంగపరంగా గురుతర బాధ్యతలు ఉన్నాయని  వ్యాఖ్యానించింది. అవినీతి, నేరాభియోగాలు ఉన్నవాళ్లు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించడం సరికాదని, అయితే వారు మంత్రివర్గంలో ఉండాలా లేదా అనేది ప్రధాని, ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యలు చేసింది.

 

Advertisement
Advertisement