మాట తప్పిన కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని పిలుపు
ఫైజాబాద్‌లో రాముడు, రామాలయ చిత్రాలున్న సభలో ప్రసంగం
సభపై నివేదిక కోరిన ఎన్నికల సంఘం
ఫెజాబాద్ (ఉత్తరప్రదేశ్): బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్ని రామనామ జపంతో హోరెత్తిం చారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు, దానికి మద్దతిస్తున్న వారికి శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యవాసులు గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మోడీ సోమవారం అయోధ్య సమీపంలోని ఫైజాబాద్‌లో శ్రీరాముడి, ప్రతిపాదిత అయోధ్య రామాలయ చిత్రాలతో అలంకరించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఓట్ల కోసం తన ప్రసంగంలో చాలాసార్లు రామనామాన్ని జపించిన మోడీ రామమందిరాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ‘ఇది రాముడి భూమి. ప్రాణం పోయినా మాట తప్పకూడదనే ప్రజలు నివసిస్తున్న భూమి. వాగ్దానాలను ఉల్లంఘించిన వారిని మీరు క్షమిస్తారా?’ అని ప్రజలనుద్దేశించి అన్నారు. అధికారంలోకి వస్తే 10 కోట్ల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.
ఎస్పీ, బీఎస్పీలు యూపీలో శత్రువులని, ఢిల్లీలో మాత్రం స్నేహితులని ధ్వజమెత్తారు. ‘అవి తల్లీకొడుకుల (సోనియా, రాహుల్) ప్రభుత్వాన్ని కాపాడతాయి. కాంగ్రెస్.. సీబీఐ నుంచి వాటిని కాపాడుతుంది’ అని విమర్శించారు. ‘రామభూమికి ప్రణమిల్లుతున్నా. మహాత్మాగాంధీ సుపరిపాలను రామరాజ్యంగా నిర్వచించారు. ఆ రాజ్యంలో ఎవరికీ అన్యాయం జరగొద్దు. రజకుడికి కూడా న్యాయం దక్కాలి’ అని అన్నారు. మోడీ ప్రసంగం మధ్యమధ్యలో సభికులు జైశ్రీరామ్ అంటూ నినదించారు. కాగా, ఈ సభలో మోడీ ప్రసంగం, సభా వేదికపై రాముడి పోస్టర్లకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఈసీ జిల్లా అధికారులను కోరింది. రాముడి చిత్రం ద్వారా ఎన్నికల ప్రచారానికి మతాన్ని వాడిన మోడీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీకి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.
అమేథీలో కాంగ్రెస్‌పై ధ్వజం: రాహుల్ లోక్‌సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ కంచుకోట అమేథీలో మోడీ వేడి పుట్టించారు. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ తరఫున ప్రచారం నిర్వహించారు. క్రోధ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు తనపై రాహుల్ చేస్తున్న విమర్శలను ఖండించారు. ఆ రాజకీయాలు కాంగ్రెస్‌కే సొంతమన్నారు. తాను ప్రతీకారం కోసం అమేథీకి రాలేదని, వెనుకబడిన ఈ ప్రాంతంలో మార్పు కోసమే వచ్చానన్నారు.
ఓడిపోతే మళ్లీ టీ అమ్ముకుంటా:‘నేను ఓడిపోతే నా కెటిల్ సిద్ధంగా ఉంది. నేను తిరిగెళ్లిపోయి టీ అమ్ముకుంటా’నని మోడీ అమేథీలో అన్నారు. టీ అమ్మిన వ్యక్తి తనను సవాల్ చేస్తున్నాడని కాంగ్రెస్ వెర్రెత్తిపోతోందని, పేద కుటుంబంలో పుట్టడం నేర మా అని ప్రశ్నించారు. తన గౌరవం అమేథీ ప్రజల చే తుల్లో ఉం దని ఉద్వేగంగా అన్నారు. పార్టీల అగ్రనేతలు సాధారణంగా ప్రత్యర్థుల నియోజకవర్గాల్లో ప్రచారానికి దూరంగా ఉంటున్న నేపథ్యంలో మోడీ అమేథీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమేథీలో మోడీకి మద్దతుగా 4 నెలల నుంచే ప్రత్యేకంగా రూపొందించిన నాలుగు చక్రాల వాహనాల్లో పెద్ద ఎల్సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, ఆయన ప్రసంగాలు వినిపిస్తున్నారు.
అయోధ్యలో మోడీ రామజపం
Published Tue, May 6 2014 12:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..
బంగారం స్పీడ్‌కు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!
Sunita Williams: రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు
ఓటు వేశారు.. డైమంగ్ రింగ్ గెలుచుకున్నారు!
అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
చంద్రబాబు ఒక శాడిస్ట్: మంత్రి కారుమూరి
Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్ నెక్లెస్ విశేషం ఏంటో తెలుసా?
Shivathmika Rajashekar: అదిరే అందాలతో కవ్విస్తోన్న శివాత్మిక (ఫోటోలు)
చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్‌గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement