జయకు అచ్చిరాని సెప్టెంబర్! | Jayalalithaa to the successful September! | Sakshi
Sakshi News home page

జయకు అచ్చిరాని సెప్టెంబర్!

Sep 28 2014 1:56 AM | Updated on Sep 2 2017 2:01 PM

జయకు అచ్చిరాని సెప్టెంబర్!

జయకు అచ్చిరాని సెప్టెంబర్!

జయలలితకు రాజకీయంగా సెప్టెంబర్ మాసం కలిసిరానట్లు కనిపిస్తోంది.

చెన్నై: జయలలితకు రాజకీయంగా సెప్టెంబర్ మాసం కలిసిరానట్లు కనిపిస్తోంది. 2001 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆమెను సీఎం పీఠం నుంచి దింపగా తాజాగా బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ప్రకటించిన తీర్పు సైతం జయ సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తోంది.

తాన్సీ భూఒప్పందం కేసులో ట్రయల్ కోర్టు దోషిగా తేల్చినా జయ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమె సీఎం పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి పగ్గాలను మంత్రివర్గ సహజరుడైన ఓ. పన్నీర్‌సెల్వంకు అప్పగించారు. ట్రయల్ కోర్టు తీర్పును మద్రాస్ హైకోర్టులో ఆమె సవాల్ చేయగా అనుకూలంగా తీర్పు రావడంతో 2002లో అందిపట్టి స్థానం నుంచి ఉప ఎన్నికలో గెలిచి తిరిగి సీఎం పీఠాన్ని అధిష్టించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement