‘మిసెస్‌ ఆసియా ఇంటర్నేషనల్‌’కు సత్కారం | Honored to mamatha trivedi | Sakshi
Sakshi News home page

‘మిసెస్‌ ఆసియా ఇంటర్నేషనల్‌’కు సత్కారం

Dec 15 2017 2:48 AM | Updated on Dec 15 2017 2:48 AM

Honored to mamatha trivedi - Sakshi

హైదరాబాద్‌: ‘క్లాసిక్‌ మిసెస్‌ ఇంటర్నేషనల్‌ వరల్డ్‌–2017’ పోటీల్లో విజేతగా నిలిచిన మమతా త్రివేదిని హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. లాలా దవాసాజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మిసెస్‌ ఇండియా పేజెంట్స్, ప్రొడక్షన్స్‌ జాతీయ డైరెక్టర్‌ దీపాలీ ఫడ్నిస్‌ హాజరయ్యారు.

మోడల్స్‌ కాకుండా రోల్‌మోడల్స్‌ అన్వేషణే మిసెస్‌ ఇండియా లక్ష్యమని ఆమె వ్యాఖ్యానించారు. లాలా దవాసాజ్‌ సంస్థ ఉత్పత్తులకు మమతా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల చైనాలోని డాంగ్‌యాంగ్‌ సిటీలో మిసెస్‌ ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ ఫైనల్స్‌ నిర్వహించారు. గత జూలైలో క్లాసిక్‌ మిసెస్‌ ఇండియాగా గెలిచిన మమతా హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్‌ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement