రంగు మార్చుకున్న పింక్ సిటీ | Sakshi
Sakshi News home page

రంగు మార్చుకున్న పింక్ సిటీ

Published Fri, Mar 6 2015 4:14 PM

Holi celebrated with traditional fervour in Pink City

జైపూర్ : పింక్ సిటీ జైపూర్ రంగుల్లో తడిసి ముద్దయింది. రంగుల కేళి హోలీ సందర్భంగా  జైపూర్  నగరవీధుల్లో ప్రజలు హల్ చల్ చేశారు. పరస్పరం గులాల్ చల్లుకుంటూ,  డ్రమ్ బీట్స్ కనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పిల్లలు పెద్దలు అందరూ ఒకరిపై ఒకరు రంగునీళ్ళను పిచికారీ చేసుకుంటూ  సంబరాలు చేసుకున్నారు.

హోలీ సంబరాల కోసం స్థానిక ఖాసాఖతి హోటెల్ లో పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ  సంబరాల్లో విదేశీయులు కూడా ఉత్సాహంగా  పాలుపంచుకున్నారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా  హోలీ  ఉత్సవాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు ప్రకటించారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement