'గొంతు నొక్కుతున్నారు' | DMK's Karunanidhi slams arrest of Tamil singer Kovan over song criticising Jayalalithaa | Sakshi
Sakshi News home page

'గొంతు నొక్కుతున్నారు'

Oct 31 2015 10:31 AM | Updated on Sep 3 2017 11:47 AM

'గొంతు నొక్కుతున్నారు'

'గొంతు నొక్కుతున్నారు'

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి మండిపడ్డారు.

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి మండిపడ్డారు. జానపద గాయకుడు ఎస్ శివదాస్ అలియాస్ కొవన్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. కొవన్ అరెస్టును వ్యతిరేకిస్తూ.. సీఎం జయలలిత ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారనడానికి ఇది ఓ ఉదాహరణ అంటూ ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న లిక్కర్ షాపులను మూసివేయాలని రాసిన పాటను వీడియో తీసి పాటను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు. 'అమ్మ'ను అవమానించే పదాలున్నాయన్న ఆరోపణలతో ఈ పాట శివదాస్ అరెస్టుకు దారితీసింది.

జయలలితను అవమానిస్తూ పాట రాశారనే ఆరోపణతో జానపద గాయకుడు ఎస్ శివదాస్ ను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసిన విషయం విదితమే. విప్లవ సంస్థ 'మక్కల్ కళై ఇలక్కియ కజగమ్'తో ఆయనకు సంబంధాలున్నాయని, రాజద్రోహంతో పాటు పలు సెక్షన్ల కింద శివదాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement