ఆ జాబితాలో మన సిటీలు | Delhi, Mumbai, Bengaluru among top cities list | Sakshi
Sakshi News home page

ఆ జాబితాలో మన సిటీలు

Jan 25 2018 6:04 PM | Updated on Jan 25 2018 7:40 PM

Delhi, Mumbai, Bengaluru among top cities list - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎదుగుతున్న ప్రపంచ నగరాల జాబితాలో భారత్‌ నుంచి ముంబయి, ఢిల్లీ, బెంగళూర్‌ నగరాలు చోటుదక్కించుకున్నాయి. అంతర్జాతీయ స్ధిరాస్థి సేవల సంస్థ జేఎల్‌ఎల్‌ ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి వాణిజ్య కేంద్రాలను ఈ జాబితాలో పొందుపరిచింది. 80 అంతర్జాతీయ నగరాలను వాణిజ్య అవకాశాలు, పెట్టుబడులు వంటి ప్రామాణికాల ఆధారంగా నాలుగు క్యాటగిరీలుగా ఈ నివేదిక విభజించింది. ఆయా నగరాల్లో పెట్టుబడి అవకాశాలు, రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగ బలాబలాలను విశ్లేషించింది. ఎదుగుతున్న ప్రపంచ నగరాల జాబితాలో భారత్‌ నుంచి మూడు నగరాలు తొలిసారిగా చోటు దక్కించుకున్నాయని జేఎల్‌ఎల్‌ ఇండియా పేర్కొంది.

ఈ జాబితాలో ఢిల్లీ, ముంబయి డీమ్డ్‌ మెగా హబ్స్‌గా పేరొందగా, బెంగుళూర్‌ హై ఎంటర్ర్‌పైజర్స్‌ సిటీగా వినుతికెక్కింది. ఎదుగుతున్న ప్రపంచ నగరాల్లో మన సిటీలు సత్తా చాటినా టాప్‌ 7 సిటీలతో పోలిస్తే భారతీయ నగరాలు మెరుగైన సామర్థ్యం కనబరచాలని జేఎల్‌ఎల్‌ ఇండియా సీఈఓ, కంట్రీ హెడ్‌ రమేష్‌ నాయర్‌ పేర్కొన్నారు. టాప్‌ సెవెన్‌ సిటీస్‌లో లండన్‌, న్యూయార్క్‌, పారిస్‌, సింగపూర్‌, టోక్యో, హాంకాంగ్‌, సియోల్‌లు నిలిచాయి.

Advertisement
 
Advertisement
Advertisement