అడుక్కున్నా.. అంతెత్తునే! | costly beggars In India | Sakshi
Sakshi News home page

అడుక్కున్నా.. అంతెత్తునే!

Mar 1 2015 7:27 AM | Updated on Sep 2 2017 10:05 PM

అడుక్కున్నా.. అంతెత్తునే!

అడుక్కున్నా.. అంతెత్తునే!

నెలకు 75 వేల ఆదాయం.. 70 లక్షల ఫ్లాట్.. బోలెడంత బ్యాంక్ బ్యాలెన్స్..

న్యూఢిల్లీ: నెలకు 75 వేల ఆదాయం.. 70 లక్షల ఫ్లాట్.. బోలెడంత బ్యాంక్ బ్యాలెన్స్.. ఇదంతా ఎవరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గురించి అనుకుం టున్నారా..? అయితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇదంతా భారత్ జైన్ అనే 49 ఏళ్ల యాచకుడి లెవల్.. అతనే కాదు ముంబైలోని చార్నీ రోడ్డులో భిక్షమెత్తుకునే కృష్ణకుమార్ గీతే రోజుకు రూ. 1,500 సంపాదిస్తాడు.

అతనికి నల్లసోపారా ప్రాంతంలో దాదాపు రూ. 40 లక్షలు విలువ చేసే ఫ్లాట్ ఉంది. ఇక పట్నాకు చెందిన సరస్వతీ దేవి యాచిస్తూనే ఏడాదికి రూ. 36వేల బీమా చెల్లిస్తోంది. ఆమెకు ఖరీదైన ఇల్లు ఉంది. ముంబైలోని ఖర్ ప్రాంతంలో అడుక్కునే శంభాజీ కాలే కూడా భిక్షమెత్తుకునే.. లక్షల విలువ చేసే ఫ్లాట్లు కొన్నాడు. రెండు ఇళ్లు కూడా కట్టించాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement