చీపురు కట్ట ఏకంగా రూ.200 | broom bandle cost Rs.200.. | Sakshi
Sakshi News home page

చీపురు కట్ట ఏకంగా రూ.200

Feb 11 2015 11:56 AM | Updated on Sep 2 2017 9:09 PM

చీపురు కట్ట ఏకంగా రూ.200

చీపురు కట్ట ఏకంగా రూ.200

'ఆప్' సునామీతో మంగళవారం ఢిల్లీలో 'చీపురు కట్ట'ల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

న్యూఢిల్లీ :  'ఆప్' సునామీతో మంగళవారం ఢిల్లీలో 'చీపురు కట్ట'ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పార్టీ గుర్తు అయిన 'జాడూ' చేతిలో పట్టుకొని సంబురాల్లో పాల్గొందామని ఆప్ శ్రేణులు వాటిని కొనడానికి ఎగబడ్డారు. దాంతో దుకాణదారులు ఈ గిరాకీని ఊహించి తగినన్ని చీపురుకట్టలు స్టాక్ పెట్టినా.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

సాధారణంగా రూ.30 నుంచి రూ.50 దాకా పలికే చీపురు కట్ట మంగళవారం ఏకంగా రూ. 200 పలికిందట. అయితే అంత ధర పెట్టడానికి సిద్ధమైనా దొరకకపోవడంతో కొన్నిచోట్ల ఆప్ అభిమానులు ఊసురుమన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement