ఆలయ భూములపై ఘర్షణ: ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

ఆలయ భూములపై ఘర్షణ: ముగ్గురు మృతి

Published Sun, Oct 15 2017 3:32 AM

3 killed in clash over temple land encroachment in UP - Sakshi

దియోరియా: ఉత్తరప్రదేశ్‌లో దేవాలయ భూముల ఆక్రమణకు సంబంధించి జరిగిన ఘర్షణలో ముగ్గురు మరణించారు. దియోరియా జిల్లాలోని సరౌరా గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. దేవాలయం పక్కన పెట్రోల్‌ పంపు యజమాని గోడ కట్టడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఆ భూమిని అతను ఆక్రమిస్తున్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో గ్రామస్తులు, పెట్రోల్‌ పంపు సిబ్బంది మధ్య గొడవ ముదిరి హింసాత్మకంగా మారింది. మధ్యలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో నలుగురికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గ్రామంలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు వెల్లడించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement