నిజ జీవిత ప్రేమకథ | Ye Rojaithey Choosano Movie Audio Launched | Sakshi
Sakshi News home page

నిజ జీవిత ప్రేమకథ

Dec 11 2014 12:29 AM | Updated on Sep 2 2017 5:57 PM

నిజ జీవిత ప్రేమకథ

నిజ జీవిత ప్రేమకథ

ఇది మా దర్శకుడి నిజజీవిత ప్రేమకథ ఆధారంగా తెరకెక్కింది. చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది’’ అని హీరో మనోజ్ నందం చెప్పారు. మనోజ్ నందం,

‘‘ఇది మా దర్శకుడి నిజజీవిత ప్రేమకథ ఆధారంగా తెరకెక్కింది. చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది’’ అని హీరో మనోజ్ నందం చెప్పారు. మనోజ్ నందం, స్మితిక ఆచార్య జంటగా బాలా. జి దర్శకత్వంలో సందిరి గిరి, తన్నీరు సింహాద్రి నిర్మిస్తోన్న ‘ఏ రోజైతే చూశానో’... పాటల సీడీని సీనియర్ నటుడు దేవదాస్ కనకాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘నా శిష్యుడైన బాలా. జి దర్శకునిగా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు. నాగచైతన్యకు ‘ఏమాయ చేసావె’లా, మనోజ్ నందంకు ఈ సినిమా నిలిచిపోతుందని దర్శకుడు పేర్కొన్నారు. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీపడలేదని నిర్మాతలు తెలిపారు. హేమాస్ మీడియా అధినేత కె. సురేశ్‌బాబు, నిర్మాత దామోదర్ ప్రసాద్, లక్ష్మీదేవి కనకాల, వీరశంకర్, చంద్రమహేశ్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement