వారాంతంలో రెండు రోజులు | weekend for two days | Sakshi
Sakshi News home page

వారాంతంలో రెండు రోజులు

Apr 11 2014 2:33 AM | Updated on Sep 2 2017 5:51 AM

వారాంతంలో రెండు రోజులు

వారాంతంలో రెండు రోజులు

రెండు రోజులు ఎలా గడుస్తున్నాయనేది ఈ చిత్రంలో చూపించాం. ఇందులో స్టార్ హీరోలు లేకపోయినా అన్ని వాణిజ్య హంగులూ ఉన్నాయి’’ అని దర్శకుడు గవర నాగు చెప్పారు.

‘‘దర్శకుడు కావాలన్న నా కలను నటుడు శ్రీహరి నెరవేర్చారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. ప్రస్తుత ట్రెండ్‌లో వారాంతంలో రెండు రోజులు ఎలా గడుస్తున్నాయనేది ఈ చిత్రంలో చూపించాం. ఇందులో స్టార్ హీరోలు లేకపోయినా అన్ని వాణిజ్య హంగులూ ఉన్నాయి’’ అని దర్శకుడు గవర నాగు చెప్పారు.
 
 అదిత్, సుప్రియా శైలజ జంటగా తోట మధు నిర్మిస్తోన్న ‘వీకెండ్ లవ్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. శేఖర్‌చంద్ర స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని రమేశ్ ప్రసాద్ ఆవిష్కరించి, గుణ్ణం గంగరాజుకి అందించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ-  ‘‘నాగు చాలా బాగా తెరకెక్కించాడు.
 
 శేఖర్‌చంద్ర మంచి ట్యూన్స్ ఇచ్చాడు. పాటలు ఈ సినిమాకు ఎస్సెట్ అవుతాయి’’ అని తెలిపారు. అదిత్, రవివర్మ, పూజ, కుంచెరఘు, బి.జయ, భాగ్యలక్ష్మి, సురేశ్ కొండేటి తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement