ఆ సినిమాకు ఫస్టు రోజే రికార్డు కలెక్షన్లు | Vivegam box-office collection Day One | Sakshi
Sakshi News home page

ఆ సినిమాకు ఫస్టు రోజే రికార్డు కలెక్షన్లు

Aug 25 2017 3:49 PM | Updated on Sep 17 2017 5:58 PM

ఆ సినిమాకు ఫస్టు రోజే రికార్డు కలెక్షన్లు

ఆ సినిమాకు ఫస్టు రోజే రికార్డు కలెక్షన్లు

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన 'వివేగం' సినిమా రికార్డు వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది.

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన 'వివేగం' సినిమా రికార్డు వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు భారీ కలెక్షన్లు రాబట్టినట్టు తెలుస్తోంది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్‌ కలెక్షన్లు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

చెన్నైలో ఈ సినిమా వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. రజనీకాంత్‌ 'కబాలి' రికార్డును బ్రేక్‌ చేసింది. చెన్నైలో 'కబాలి' తొలి రోజు రూ. 1.12 కోట్లు సాధించగా, 'వివేగం' రూ. 1.21 కోట్లు వసూలు చేసి రికార్డు తిరగరాసింది. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అజిత్‌ సినిమాకు మొదటిరోజు భారీ కలెక్షన్లు రావడం విశేషం. తమిళనాడులో రూ. 20 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్‌ వర్గాల ప్రాథమిక సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది.

తెలుగు, తమిళంలోనే రూ. 35 కోట్ల ఓపెనింగ్‌ వసూళ్లు వస్తాయని 'ది హిందు' అంచనా వేసింది. అదే నిజమైతే 'కబాలి' రికార్డు చెరిగిపోవడం ఖాయం. రూ.21 కోట్ల ఓపెనింగ్‌ కలెక్షన్‌తో కోలీవుడ్‌లో 'కబాలి' ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉంది. రూ.100 కోట్లపైగా బడ్జెట్‌తో నిర్మించిన 'వివేగం' ప్రపంచవ్యాప్తంగా మూడు వేలకుపైగా ధియేటర్లలో విడుదలైంది. అజిత్‌ 25వ సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. డిస్ట్రిబ్యూషన్‌, శాటిలైట్‌ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో 'వివేకం' పేరుతో విడుదల చేశారు. శివ దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా కాజల్‌ నటించింది.

Advertisement
 
Advertisement
Advertisement