మాస్‌ హీరో.. వంశీకి చాన్స్‌ ఇస్తాడా..?

Vakkantham Vamsi Second Directorial With Ravi Teja - Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య  నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రచయిత వక్కంతం వంశీ. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన వంశీ దర్శకుడిగా మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. నా పేరు సూర్య రిలీజ్ తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న వక్కంతం వంశీ ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప‍్రకటించలేదు. తాజాగా వంశీ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

మాస్‌ మహరాజ్‌ రవితేజ హీరోగా ఓ సినిమా చేసేందుకు వంశీ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ.. శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్‌ అక్బర్‌ ఆంటోని సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఎక్కడి పోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో పాటు వక్కంతం వంశీ దర్శకత్వంలోనూ సినిమా చేయనున్నాడట. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top