‘మెర్శల్‌’కు ముఖ్యమంత్రి మద్దతు | V Narayanasamy support Mersal Movie | Sakshi
Sakshi News home page

‘మెర్శల్‌’కు ముఖ్యమంత్రి మద్దతు

Oct 23 2017 3:05 PM | Updated on Oct 23 2017 3:05 PM

V Narayanasamy support Mersal Movie

తమిళసినిమా (చెన్నై): మెర్శల్‌ చిత్రానికి రాజకీయ మద్దతు పెరుగుతోంది. విజయ్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం మెర్శల్‌. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఇందులో జీఎస్‌టీ, పెద్దనోట్ల రద్దు వంటి అంశాలపై డైలాగ్‌లు ఉండటంతో బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా విమర్శించిన నేపథ్యంలో తాజాగా, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి మెర్శల్‌ వివాదంపై ఆదివారం ఓ ప్రకటనలో స్పందించారు.

భారతదేశంలో పత్రికల స్వేచ్ఛను, భావస్వేచ్ఛను గత రాజకీయ పార్టీ నేతలు కాపాడుకుంటూ వచ్చారనీ, దాన్ని ఇప్పుడు బీజేపీ హరించే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే వారిపై చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement