దీపికాతో గొడవ ఎందుకని!? | Tumhari Sulu release preponed to November 17 | Sakshi
Sakshi News home page

దీపికాతో గొడవ ఎందుకని!?

Oct 12 2017 12:55 AM | Updated on Oct 12 2017 5:00 AM

Tumhari Sulu release preponed to November 17

సులోచన మరో వారం ముందుకొచ్చేసింది. సులోచన అంటే విద్యాబాలనే! ఆమెకు దీపికాతో గొడవ ఏంటి? అంటే... దీపికాతో కాదు, దీపికా పదుకునే నటించిన సినిమాతో గొడవ ఎందుకని!? అసలే, దీపిక నగలు, ఆమె రాజసం చూస్తే భారీగా ఉన్నాయి. విద్యా ఏమో సింపుల్‌గా శారీ కట్టుకొస్తున్నారు. దీపిక భారీ హడావిడి ముందు సింపుల్‌ శారీ ఎక్కడ చిన్నబోతుందోనని విద్యాబాలన్‌ మరింత ముందుకొచ్చేశారని బీటౌన్‌ టాక్‌!! మేటర్‌ ఏంటంటే... సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రాజ్‌పుత్‌ రాణి పద్మావతిగా దీపిక నటించిన సినిమా ‘పద్మావతి’.

షాహిద్‌ కపూర్, రణవీర్‌ సింగ్‌ కూడా నటించిన ఈ సినిమాను డిసెంబర్‌ 1న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్‌.జె. (రేడియో జాకీ) సులోచనగా విద్యాబాలన్‌ నటించిన ‘తుమ్హారీ సులు’ను కూడా ముందు డిసెంబర్‌ 1న విడుదల చేయాలనుకున్నారు. ‘పద్మావతి’తో పాటు అమితాబ్‌ బచ్చన్, రిషీ కపూర్‌ల ‘101 నాట్‌ అవుట్‌’ కూడా అదే తేదీన విడుదల చేయాలనుకుంటున్నారని ‘తుమ్హారీ సులు’ టీమ్‌ కొంచెం జాగ్రత్త పడింది.

డిసెంబర్‌ 1న కాకుండా నవంబర్‌ 24న వస్తామని చెప్పారు. ఇప్పుడు ‘పద్మావతి’ ట్రైలర్‌ విడుదలైన తర్వాత మళ్లీ మనసు మార్చుకున్నారు. మరో వారం ముందుకొచ్చారు. నవంబర్‌ 17న ‘తుమ్హారీ సులు’ను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. దీపిక సినిమా వచ్చిన తర్వాత సులోచన ఎక్కడ కనిపించకుండా పోతుందోనని ఆ సినిమాకీ ఈ సినిమాకీ పది రోజులకు పైగా గ్యాప్‌ ఉండేలా చూసుకున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement