హీరోగా మారుతున్న విలన్ | Tollywood villain kabir singh duhan turns hero | Sakshi
Sakshi News home page

హీరోగా మారుతున్న విలన్

Nov 3 2016 2:20 PM | Updated on Sep 4 2017 7:05 PM

హీరోగా మారుతున్న విలన్

హీరోగా మారుతున్న విలన్

జిల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ విలన్ కబీర్ సింగ్ దుహన్. తొలి సినిమాతోనే విలన్గా తానేంటో నిరూపించుకున్న కబీర్, కేవలం రెండేళ్ల సమయంలో 25కు పైగా సినిమాల్లో నటించి...

జిల్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ విలన్ కబీర్ సింగ్ దుహన్. తొలి సినిమాతోనే విలన్గా తానేంటో నిరూపించుకున్న కబీర్, కేవలం రెండేళ్ల సమయంలో 25కు పైగా సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. విలన్గా నటిస్తున్నా.. స్టైలిష్ లుక్స్తో హీరోలకు పోటి ఇచ్చే గ్లామర్ కబీర్ సొంతం. అందుకే ఈ యంగ్ విలన్.., హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.

అశ్విన్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న చిత్రంతో కబీర్ సింగ్ దుహన్ హీరోగా మారుతున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ జానర్గా పేరు తెచ్చుకున్న హర్రర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందనుంది. ప్రస్తుతం సుధీప్ హీరోగా తెరకెక్కుతున్న హెబ్బులి సినిమాలో మెయిన్ విలన్గా నటిస్తున్న కబీర్ త్వరలోనే హీరోగానూ అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement