త్వరలో డెరైక్షన్! | The return journey | Sakshi
Sakshi News home page

త్వరలో డెరైక్షన్!

Apr 26 2016 12:45 AM | Updated on Sep 3 2017 10:43 PM

త్వరలో డెరైక్షన్!

త్వరలో డెరైక్షన్!

‘తని ఒరువన్’ సినిమాలో స్టయిలిష్ విలన్‌గా కనిపించిన మాజీ హీరో అరవింద్ స్వామి ఈ చిత్రం తెలుగు రీమేక్‌లోనూ అదే పాత్ర చేస్తున్నారు.

‘తని ఒరువన్’ సినిమాలో స్టయిలిష్ విలన్‌గా కనిపించిన మాజీ హీరో అరవింద్ స్వామి ఈ చిత్రం తెలుగు రీమేక్‌లోనూ అదే  పాత్ర చేస్తున్నారు. మరో పక్క ‘డియర్ డాడ్’ అనే చిత్రంతో హిందీలో రీ-ఎంట్రీ ఇస్తున్నారాయన. ఇన్నాళ్లు వ్యాపారంలో బిజీబిజీగా ఉన్న అరవింద్‌స్వామి ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదే దృష్టి సారించనున్నారు. నటుడిగా మాత్రమే కాదు.. డెరైక్షన్ కూడా చేయాలనుకుంటున్నారు. ‘‘ఇప్పటికే నా చేతిలో రెండు స్క్రిప్టులున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తా. అయితే అది హిందీలోనా...లేక తమిళంలోనా? అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను’’ అని వెల్లడించారాయన.

కాలానుగుణంగా మారుతున్న ప్రేక్షకుల అభిరుచి గురించి అరవింద్ స్వామి మాట్లాడుతూ- ‘‘ప్రేక్షకులు రొటీన్ ఐడియాలను తిప్పికొడుతున్నారు. వాళ్లు సినిమాలు చూసే విధానంలో మార్పు వచ్చింది. కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అందుకే రకరకాల ప్రయోగాలతో సినిమాలు తీయడానికి ఆస్కారం దొరుకుతోంది’’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement