ఆ ఇద్దరి కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం | The combination of the two, a huge film | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం

Jun 13 2016 1:34 AM | Updated on Sep 4 2017 2:20 AM

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో   మరో భారీ చిత్రం

ఆ ఇద్దరి కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం

హిట్ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కుతుందంటే దాని క్రేజే వేరు. వరుస విజయాలతో యమ జోష్‌లో ఉన్న హీరో జయంరవి.

హిట్ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కుతుందంటే దాని క్రేజే వేరు. వరుస విజయాలతో యమ జోష్‌లో ఉన్న హీరో జయంరవి. ఇక ఊహకందని కథ, కథనాలతో రూపొందిన నాణయం, సైనికదళం నేపథ్యంలో వరస హత్యల సైకో ఇతి వృత్తంతో నాయిగళ్ జాగ్రత్తై జోంబిల కథతో మిరుదన్ అంటూ హాలీవుడ్ చిత్రాల తరహాలో చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు శక్తి సౌందరరాజన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తాజా చిత్రమే మిరుదన్. ఈ చిత్రం విశేష పజాదరణ పొందిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ కాంబినేషన్‌లో ఒక చిత్రం రూపొందనుందన్నది తాజా సమాచారం.


ఈ క్రేజీ చిత్రాన్ని ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నెమీచంద్ జపక్ ప్రొడక్షన్స్ అధినేత వి.హటేశ్ జపక్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో నటించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని చిత్ర వర్గాలు వెల్లడించారు. జయంరవి ప్రస్తుతం ప్రభుదేవా నిర్మిస్తున్న బోగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత శక్తి సౌందరరాజన్ దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement