టెన్‌ డేస్‌ బ్రేక్‌... సైరా | Ten Days Break For Rangasthalam | Sakshi
Sakshi News home page

టెన్‌ డేస్‌ బ్రేక్‌... సైరా

Dec 2 2017 8:33 AM | Updated on Dec 2 2017 8:33 AM

Ten Days Break For Rangasthalam - Sakshi

ఇప్పుడంటే బ్రాండెడ్‌ బట్టలు, బోలెడన్ని డిస్కౌంట్లు, ఫెస్టివల్‌ బంపర్‌ ఆఫర్లు ఉన్నాయి. కానీ, 30 ఏళ్ల క్రితం సీన్‌ వేరు. బ్రాండెడ్‌ ఉన్నప్పటికీ.. అందరికీ అందుబాటులో ఉండేవి కావు. ముఖ్యంగా పల్లెల్లో నేత దుస్తులే వాడేవారు. ఇప్పుడు టాప్‌ టు బాటమ్‌ బ్రాండెడ్‌ వేర్‌ వాడుతున్న రామ్‌చరణ్‌ నేత దుస్తుల గురించి తెలుసుకుంటున్నారు. ఒక్కసారి ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటో చూడండి! పోగు.. పోగు కలిపి నేత బట్టలను ఇలా నేస్తారా? అని రామ్‌చరణ్‌ తెలుసుకుంటున్నట్లు ఉంది కదా! ఇది ‘రంగస్థలం’ సినిమా కోసం అని ఊహించే ఉంటారు. 1985 బ్యాక్‌డ్రాప్‌లో సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం తాజా స్టిల్‌ ఇది. అదిరింది కదూ. ఇంతకీ ‘రంగస్థలం’ ఎందాకా వచ్చిందంటే.. ప్రస్తుతం ప్యాచ్‌వర్క్‌ జరుగుతోంది. హైదరాబాద్‌లో వేసిన విలేజ్‌ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు.

వచ్చే సోమవారం వరకూ ఈ షూట్‌ జరుగుతుంది. ఆ తర్వాత చిన్న బ్రేక్‌. టెన్‌ డేస్‌ రామ్‌చరణ్‌ వేరే సిన్మా ప్లాన్స్‌తో బిజీగా ఉంటారు. అంటే... ఇంకో సినిమా ఏమైనా కమిట్‌ అయ్యారనుకుంటున్నారేమో? హీరోగా కమిట్‌ అయ్యారు కానీ, ఈ బిజీ మాత్రం నిర్మాతగా. చిరంజీవి ‘సైరా’ ఈ నెల 6న ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసమే టెన్‌ డేస్‌ బ్రేక్‌. ‘రంగస్థలం’ కెమెరామేన్‌ రత్నవేలు ‘సైరా’కి కూడా వర్క్‌ చేయనున్నారు. పది రోజులు షూట్‌ తర్వాత ‘సైరా’కి చిన్ని బ్రేక్‌. వెంటనే ‘రంగస్థలం’ మొదలవుతుంది. ఆ షెడ్యూల్‌లో చిత్రీకరించే మూడు పాటలతో సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్‌ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ఆది పినిశెట్టి నటిస్తోన్న విషయం తెలిసిందే. చరణ్‌కి బ్రదర్‌గా నటిస్తున్నారని వార్త షికారు చేస్తోంది. ‘అది నిజమే. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్‌ సూపర్‌’ అని యూనిట్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement