శివాజి నిర్మాణ సంస్థలో ఆ ఇద్దరు | Shivaji structural organization of the two | Sakshi
Sakshi News home page

శివాజి నిర్మాణ సంస్థలో ఆ ఇద్దరు

Jun 4 2016 4:45 AM | Updated on Sep 4 2017 1:35 AM

శివాజి నిర్మాణ సంస్థలో ఆ ఇద్దరు

శివాజి నిర్మాణ సంస్థలో ఆ ఇద్దరు

దివంగత మహానటుడు శివాజీగణేశన్‌కు చెందిన శివాజీ ప్రొడక్షన్‌లో ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.

దివంగత మహానటుడు శివాజీగణేశన్‌కు చెందిన శివాజీ ప్రొడక్షన్‌లో ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు.అంతే కాదు శివాజీ ప్రొడక్షన్ సంస్థలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మన్నన్, చంద్రముఖి,కమలహాసన్ వెట్ట్రివిళా, అజిత్ అసల్ వంటి పలు చిత్రాలు నిర్మాణం అయ్యాయి. కొన్నేళ్లుగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న ఈ సంస్థ తాజాగా మళ్లీ రంగంలోకి దిగింది. ఒకే సారి రెండు చిత్రాలను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి ఇళయదళపతి విజయ్ హీరోగా నిర్మించనున్నట్లు, దీనికి తెరి చిత్రం ఫేమ్ అట్లీ గానీ జిల్లా చిత్రం ఫేమ్ నెల్సన్ గానీ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. మరో చిత్రంలో శివాజీ కుటుంబ వారసుడు విక్ర మ్‌ప్రభు కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం.

దీనికి నవ దర్శకుడు అశోక్ మెగాఫోన్ పట్టనున్నారు. విశేషం ఏమిటంటే శివాజీ ప్రొడక్షన్స్ సంస్థలో విజయ్ తొలిసారిగా నటించనున్నారు.అదే విధంగా నటుడు విక్రమ్‌ప్రభు ఇప్పటి వరకూ సొంత బ్యానర్‌లో నటించలేదు. ప్రప్రథంగా ఇప్పుడు నటించడానికి సిద్ధం అవుతున్నారన్నమాట. విజయ్ ప్రస్తుతం తన 60వ చిత్రాన్ని విజయా ప్రొడక్షన్‌కు చేస్తున్నారు. భరతన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తున్నారు. దీనికి గతంలో ఎమ్జీఆర్ నటించిన ఎంగవీట్టి పిళ్లై చిత్ర టైటిల్‌ను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తన 61వ చిత్రాన్ని శివాజీ ప్రొడక్షన్స్ సంస్థకు చేయనున్నట్లు సమాచారం.     
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement