50 కేజీ తాజ్‌మహల్...100 కేజీలు మోసింది! | Sakshi
Sakshi News home page

50 కేజీ తాజ్‌మహల్...100 కేజీలు మోసింది!

Published Tue, Feb 9 2016 11:33 PM

50 కేజీ తాజ్‌మహల్...100 కేజీలు మోసింది!


 ఏడుమల్లెలెత్తు సుకుమారి ఏడు కిలోలు బరువు మోస్తేనే చూడ్డానికి బాధగా ఉంటుంది. ఏకంగా వంద కిలోల బరువు ఎత్తితే ‘సుకుమారీ.. నా గుండె గుబగుబలాడిందే కుమారీ’ అని కుర్రకారు కవిత రాసేస్తారు. ఇప్పుడు సమంత చేసిన పనికి అలానే కొంతమంది కవులైపోయారు. ‘ఫిఫ్టీ కేజీ తాజ్‌మహల్ అనిపించుకున్న నీకెందుకమ్మా ఈ శ్రమ’ అని ఫీలైపోతున్నారు.
 
  ఇంతకీ సమంత ఏం చేశారంటే... ఒకటీ రెండు కాదు... ఏకంగా 100 కిలోల బరువు ఎత్తారు. జిమ్‌లో తన ట్రైనర్ సమక్షంలో ఏకంగా మూడు సార్లు ఇలా 100 కిలోలు మోశారామె. దీన్ని వీడియో తీసి, యూ ట్యూబ్‌లో పెట్టారు. ఈ వీడియో చూసినవాళ్లందరూ, ‘సమంత సూపర్’ అని కితాబులిచ్చేస్తున్నారు.
 
 మూడుసార్లు బరువు మోసిన తర్వాత ‘నేను సాధించేశా’ అంటూ ఆనందంగా సమంత నవ్విన వైనం ఆ వీడియోలో కనిపిస్తోంది. జస్ట్ 50 కిలోలకు అటూ ఇటూగా ఉండే సమంత తన శరీర బరువుకు రెండింతల వెయిట్ లిఫ్ట్ చేయడమంటే మాటలు కాదు. మొత్తానికి, బరువైన పాత్రలు మాత్రమే కాదు... అవసరమైతే ఇలా బరువులు కూడా సునాయాసంగా మోస్తానని సమంత చెప్పకనే చెప్పినట్లుంది కదూ.
 

Advertisement
Advertisement