ఆ సినిమా బిగ్ హిట్ కావాలి | Salman wants 'Manjhi...' to be a 'big hit' | Sakshi
Sakshi News home page

ఆ సినిమా బిగ్ హిట్ కావాలి

Aug 22 2015 12:02 PM | Updated on Sep 3 2017 7:56 AM

ఆ సినిమా బిగ్ హిట్ కావాలి

ఆ సినిమా బిగ్ హిట్ కావాలి

భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన బాలీవుడ్ మూబీ 'మాంఝీ -ద మౌంటెన్ మ్యాన్'పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై అభినందనల వర్షం కురిపించారు.

ముంబైః  భారీ అంచనాలతో శుక్రవారం విడుదలైన బాలీవుడ్ మూవీ  'మాంఝీ -ద మౌంటెన్ మ్యాన్'పై  ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై అభినందనల వర్షం కురిపించారు. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలని కోరుకున్నారు. ముఖ్యంగా నవాజుద్దీన్ సిద్ధిఖీ నటన బాగుందని ప్రశంసించారు. సినిమా టీం మొత్తానికి అభినందనలు  తెలుపుతూ ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేశారు.

బీహార్ జిల్లా గయలో జరిగిన నిజజీవిత గాధకు దృశ్యరూపం ఈ సినిమా. రోడ్డు లేకపోవడంతో కనీస వైద్య సదుపాయాలు అందక అల్లాడుతున్న ప్రజల కోసం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చేసిన సాహసానికి  ప్రతిరూపం ఈ సినిమా. కేతన్ మెహతా దర్శకత్వ ప్రతిభకు, నవాజుద్దీన్ నటనకు విమర్శకులు నీరాజనాలు పడుతున్నారు. గాంగ్స్ ఆఫ్ వాసీపూర్ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులకు దడ పుట్టించిన నవాజుద్దీన్, సల్మాన్ బిగ్గెస్ట్ హిట్ కిక్, భజరంగీ భాయిజాన్ సినిమాల్లో కూడా తన నటనతో ఆకట్టుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement