నేను హిందూ-ముస్లింని..! | salman khan says he is an indian when asked about caste | Sakshi
Sakshi News home page

నేను హిందూ-ముస్లింని..!

Apr 29 2015 6:51 PM | Updated on Sep 3 2017 1:07 AM

నేను హిందూ-ముస్లింని..!

నేను హిందూ-ముస్లింని..!

వెండితెర మీద ఎన్ని వేషాలు వేసినా.. ప్రేక్షకులు చూస్తే చూస్తారు, లేకపోతే సినిమాను ఫ్లాప్ చేస్తారు. అదే కోర్టులో వేస్తే? జడ్జి గారికి చిర్రెత్తుకొస్తుంది కదూ.

సల్మాన్ ఖాన్ తన కులం, మతం విషయంలో కోర్టులో చెప్పిన విషయాలు.. పలువురికి విస్మయాన్ని కలిగించాయి. సల్మాన్ ఖాన్ను అతడి కులం గురించి అడిగితే.. తాను 'భారతీయుడిని' అని చెప్పాడు. భారతీయత అనేది కులం కాదని గట్టిగా చెప్పగా.. తాను 'హిందూ-ముస్లిం'ని అని జవాబిచ్చాడు. అదెలా కుదురుతుందని అడిగితే, తన తల్లి హిందువని, తండ్రి ముస్లిం అని తెలిపాడు.

1998లో సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లి, అక్కడ కృష్ణజింకను వేటాడిన కేసులో విచారణ కోసం సల్మాన్ ఖాన్ జోధ్పూర్ కోర్టుకు వెళ్లాడు. అతడిమీద మోపిన నేరాలను చదివి వినిపించేముందు కోర్టులో అతడి పేరు, కులం, వృత్తి తదితరాలు అడుగుతారు. దాని ప్రకారమే అడిగినప్పుడు సల్మాన్ ఇలాంటి సమాధానాలు ఇచ్చాడట!

Advertisement
 
Advertisement
Advertisement