ఇష్టం ఉంటే తిక్క ఉన్నట్లే! | Sai Dharam Tej's Thikka Motion Poster | Sakshi
Sakshi News home page

ఇష్టం ఉంటే తిక్క ఉన్నట్లే!

Jun 25 2016 10:32 PM | Updated on Sep 4 2017 3:23 AM

ఇష్టం ఉంటే తిక్క ఉన్నట్లే!

ఇష్టం ఉంటే తిక్క ఉన్నట్లే!

సినిమా మీద ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికీ తిక్క ఉన్నట్లే. ఈ సినిమాలో ఎంత యాక్ష న్ ఉంటుందో అంత కామెడీ ఉంటుంది.

‘‘సినిమా మీద ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికీ తిక్క ఉన్నట్లే. ఈ సినిమాలో ఎంత యాక్ష న్ ఉంటుందో అంత కామెడీ ఉంటుంది. ఇందులో నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. నా కోసం యువ దర్శకులు మంచి మంచి పాత్రలు రాస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు.
 
 సాయిధరమ్ తేజ్, లారిస్సా బొనేసి జంటగా సునీల్‌రెడ్డి దర్శకత్వంలో రోహిన్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. ఈ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో సాయి ధరమ్‌తేజ్ మాట్లాడుతూ - ‘‘తిక్క సినిమాలో నా  క్యారెక్టర్ టిపికల్‌గా ఉంటుంది.
 
 కుటుంబ సభ్యులతో సినిమా చేసినట్లుంది. తమన్ మంచి సంగీతాన్నిచ్చారు. నా కెరీర్‌లో మంచి సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు ‘‘సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చింది. సాయి ధరమ్‌తేజ్ వల్లే సినిమా నిర్మాణ రంగంలోకి వచ్చాను. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాత రోహిన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమానికి వంశీ పైడిపల్లి అతిథిగా హాజరయ్యారు.
 

Advertisement
 
Advertisement
Advertisement